ధాన్యం కొనుగోళ్లపై సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ధాన్యం కొనుగోళ్ల అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులతో సిఎం సమావేశమయ్యారు. సోమవారం నుండి పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసంరించాల్సిన విధానంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ధాన్యం కొనుగోళ్ల అంశంపై స్పష్టత ఇవ్వాలని టిఆర్ ఎస్ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసినదే.
ధాన్యం కొనుగోళ్ల అంశంపై జాతీయ విధానం ఉండేలా కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తేవాలి? ఇతర రాజకీయ పార్టీలు మద్దతిస్తున్న తరుణంలో వారితో ఎలా సమన్వయం చేసుకొని నడవాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చిం చనున్నారు.