క్రీడా విశ్వ‌విద్యాల‌యంపై సిఎం సమీక్ష‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS):  క్రీడా విశ్వ‌విద్యాల‌యంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. క్రీడా శిక్ష‌ణా సంస్థ‌ల‌న్నీ ఒకే గొడుగు కింద‌కు వ‌చ్చేలా వ‌ర్సిటి ఉండాల‌న్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో స్పోర్ట్స్ వ‌ర్సిటిని తీర్చిదిద్దాల‌న్నా సిఎం భ‌విష్య‌త్తులో ఒలింపిక్స్ వేదిక‌గా హైద‌రాబాద్‌ను మార్చాల‌న్నారు. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సిఎం సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటికి యంగ్ ఇండియా పేరు పెట్టాల‌ని సిఎం అధికారుల‌కు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.