బాలకృష్ణ.. బావమరిదిగా దొరకడం నా అదృష్టం: సిఎం చంద్రబాబు

హైదరాబాద్ (CLiC2NEWS): హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్యకు అభినందనలు తెలిపిన సిఎం..నాకొక అద్భుతమైన బావమరిది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బాలకృష్ణతో తన అనుబంధాన్ని పంచుకున్నారు.
1974 లో బాలకృష్ణ సినిమాల్లోకి రావడం.. 78లో తొలిసారి తాను ఎమ్మెల్యే అయ్యానని చంద్రబాబు అన్నారు. నాకంటే బాలయ్యే సీనియర్ అని.. 50 ఏళ్లుగగా సినిమాలలో ఎవర్‌గ్రీన్ హీరోగా రాణిస్తున్నానన్నారు. ఆయనలో గొప్ప మానవతావాది ఉన్నారని.. క్యాన్సర్ ఆస్పత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని గొప్ప ఆస్పత్రుల్లో ఒకటిగా పేరు సొంతం చేసుకుంది. బాలయ్యకు పద్మభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉందని.. మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఇదే తొలిసారన్నారు. ఒక పక్క బాలయ్య.. మరో పక్క అంతే పవర్‌పుల్ భువనేశ్వరి.. ఇద్దరి మధ్య ఇపుడు నేను నలిగిపోతున్నానని నవ్వులు పూయించారు.