ది ఎలిఫెంటర్ విష్పరస్ పాత్రధారులకు సిఎం స్టాలిన్ సన్మానం
చెన్నై (CLiC2NEWS): ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న భారతీయ లఘుచిత్రం ది ఎలిఫెంట్ విష్పరర్స్ . ప్రపంచంలో అత్యంత గొప్ప అవార్డును సాధించడంపై దేశమంతా అభినందనలు తెలుపుతున్నారు. ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రలలో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులను సిఎం స్టాలిన్ ఘనంగా సన్మానించారు. తమిళనాడులోని మదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న వీరి వాస్తవ జీవనం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ చిత్రం రూపొందించారు. రఘు, అమ్ము అనే రెండు అనాత ఏనుగు పిల్లలు, వాటిని చేరదీయడం ఇతివృత్తంగా కార్తికి గోంజాల్వెస్ దర్శకత్వంలో తెరక్కించారు.వారికి నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. ఆ దంపతులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున నగదు చెక్కుతో పాటు జ్ఞాపికను అందజేశారు. అంతేకాకుండా మదుమలై, , అన్నామలై ఏనుగు శిబిరాల్లో పనిచేస్తున్న91 మందికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున సిఎం ప్రకటించారు. ఇంకా వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ. 9.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్కుమెంటరీ.. తమిళనాడులోని అటవీ శాఖ పనితీరును , ఏనుగుల సంరక్షణకు చేస్తున్న ప్రయత్నాలను చూపించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రంలో ప్రధాన పాత్రధారులైన బొమ్మన్, బెల్లీ .. దిక్కులేని ఏనుగులను చేరదీసి వాటి సంరక్షణను చూసే వారుగా నటించారు.