సిటీ బస్సులో సీఎం స్టాలిన్‌

చెన్నై (CLiC2NEWS): తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇవాళ స్టాలిన్ ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు య‌త్నించారు.

త‌మిళ‌నాడులో వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించేందుకు శ‌నివారం ఆయ‌న చెన్నైలోని క‌న్నాగి ప్రాంతంలోని వ్యాక్సిన్ కేంద్రాన్ని ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మం అనంత‌రం తిరుగుప్రాయనంలో అటుగా వెళ్తున్న ఓ ఆర్టీసీ బ‌స్స‌ను ఆపి అకస్మాత్తుగా కాన్వాయ్‌ దిగి సిటీ బస్సు ఎక్కారు. ఈ అనూహ్య ప‌రిణామంతో బ‌స్సులోని డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌, ప్ర‌యాణికులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

ఈ సందర్భంగా సీఎం బస్సులోని ప్రయాణికులతో సంభాషించారు. తమిళనాడులో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎలా భావిస్తున్నారో స్టాలిన్‌ ప్రత్యేకంగా మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు సీఎంతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.