`జైలర్` టీమ్‌కు సిఎం స్టాలిన్ విషెస్
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/nelson_stalin.jpg)
చెన్నై (CLiC2NEWS): సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం `జైలర్`.. గురువారం విడుదలైన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షలకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డును తిరగరాస్తోంది. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ `జైలర్` సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడితో సిఎం మాట్లాడారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో దర్శకుడు నెల్సన్ ట్వీట్ చేశాడు. ఇప్పడు ఆ ట్విట్ నెట్టింట వైరల్‌గా మారింది.
“ జైలర్“ చిత్రాన్ని వీక్షించిన సిఎం స్టాలిన్ సర్‌కి ధన్యవాదాలు. మీ ప్రశంస, అభినందన నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి… మీ ప్రశంసతో చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉంది“ అని ట్వీట్ చేశారు నెల్సన్..
కాగా కుటుంబ కథా నేపథ్యంలో మాఫీయా, ప్రతీకారం అంశాలపై ఓ రిటైర్డ్ జైలర్ కథ ఈ సినిమా.. ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీసు అధికారిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించారు. ఆయన సతీమణిగా రమ్యకృష్ణ నటించారు. వీరితో పాటు శివకుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు.