డిఎంకె ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సిఎం స్టాలిన్
రూ. 75కే పెట్రోల్, రూ. 65కే డిజిల్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్

చెన్నై (CLiC2NEWS): ఇండియా కూటమిని గెలిపిస్తే.. రూ. 75కే పెట్రోల్, రూ. 65కే డిజిల్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరపున ఎంపి అభ్యర్థులను ప్రకటించటంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
రైతులు, విద్యార్థులకు రుణమాఫీ, మహిళలందరికీ నెలకు రూ. 1000 చొప్పున ఇస్తామని సిఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. జాతీయ రాహదారులపై టోల్ బూత్‌నలు పూర్తిగా ఎత్తి వేస్తామన్నారు. జాతీయ విద్యావిధానం, నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం లను తమిళనాడులో అమలు చేయబోమని హామీ ఇచ్చారు.