పొట్టలో రూ.11కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్.. ఎయిర్‌పోర్టులో నిందితుడు అరెస్టు
ముంబయి (CLiC2NEWS): పొట్టలో కొకైన్ క్యాప్సుల్స్ తో ప్రయాణిస్తున్న నిందితుడిని ముంబయి విమానాశ్రయంలో డిఆర్ ఐ అధికారులు అరెస్టు చేశారు. సియెర్రా లియోన్ నుండి ముంబయి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 1,139 గ్రాముల మాదకద్రావ్యాలున్న 67 క్యాప్సుల్స్‌ను అతడి పొట్ట నుండి సేకరించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు. రూ.11 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడు ఐవరీకోస్ట్ జాతీయుడిగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.