యుఎన్ఓ వేదికపై ప్రియాంక చోప్రా ప్రసంగం..
రండి ప్రపంచాన్ని మార్చుకుందాం..
యునైటెడ్ నేషన్స్ (CLiC2NEWS): ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ఆమె యునిసెఫ్ సహృద్భావ రాయబారిగా ఉన్నారు. సమావేశంలో ప్రియాంక మాట్లాడుతూ సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయమైన ప్రపంచంలో జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. ప్రస్తుతం ఉన్న కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయ సంఘీభావం అత్యంత ముఖ్యమని ఆమె అన్నారు.
ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 2015లో (సుస్థిరాభివృద్ధి)17 లక్ష్యాలతో కూడిన ప్రణాళికను రూపొందించాయి. ఆ లక్ష్యాలను 2030 నాటికి చేరుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆగడువులో సగం కాలం ముగిసిపోయిందని, మిగిలిన ఎనిమిదేళ్లోనైనా ఈ లక్ష్యాలను సాధించుకోవాలని,మన ప్రపంచాన్ని మనమే మార్చుకొనే అద్భుత అవకాశం ఉందని ప్రియాంక చోప్రా అన్నారు. మన ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని ఆమె పిలుపునిచ్చారు.