కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సిజెఐ జస్టిస్ ఎన్ వి రమణ
హైదరాబాద్ (CLiC2NEWS): పెండింగ్ కేసుల సత్వర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతోందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
హైదరాబాద్‌లోని హెడ్ఐసిసిలో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఎఎంసి) సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా సిజె ఎన్వీ రమణ తెలంగాణ సిఎంతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని , మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. అస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతోందని విస్తృత సంప్రదింపులతో ఇరు పక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారుం సాధ్యం అని జస్టిన్ సిజెఐ ఎన్ వి రమణ అన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక అని అన్నారు.