Commonwealht Games: పతకాల పట్టికలో భారత్‌కు 5వ స్థానం..
బర్మింగ్‌హామ్ (CLiC2NEWS): కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతుంది. తాజాగా ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్దోస్ పాల్ స్వర్ణం సాధించాడు. అబూబకర్ నరంగోలింటెవిడ్ రజతం సొంతం చేసుకున్నాడు. భారత్ ఇప్పటి వరకు 47 పతకాలు సాధించింది. 16 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో 5వ స్థానంలో ఉంది. 44 పతకాలతో న్యూజిలాండ్ 4వ స్థానంలో ఉంది. ఎందుకంటే 17 స్వర్ణాలు సాధించటమే దానికి కారణం. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 164 (61 స్వర్ణాలు) పతకాలతో మొదటి స్ధానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 155 (50 స్వర్ణాలు) పతకాలతో రెండవ స్థానంలో ఉండగా.. కెనడా 85 (23 స్వర్ణాలు) పతకాలతో మూడవ స్థానంలో నిలిచింది.