Commonwealth Games: పివి సింధుకు స్వర్ణం..

బర్మింగ్ హామ్ (CLiC2NEWS): కామన్‌వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పివి సింధు స్వర్ణం కైవసం చేసుకుంది. బాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో సింధు 21-15, 21-13 తేడాతో కెనడాకు చెందిన మిచెలీ లీపై విజయం సాధించింది. కామన్‌వెల్త్ క్రీడల్లో సింధుకు ఇది తొలి స్వర్ణం.. 2014లో కాంస్యం సాధించింది. 2018 లో రజతం సొంతం చేసుకుంది. కామన్‌వెల్త్ పోటీల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.