ఇంటర్మీడియట్‌లో మళ్ళీ పూర్తి స్థాయి సిలబస్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం నుండి ఇంటర్మీడియట్‌లో మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలుకానుంది. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తరగతులు సరిగా నిర్వహించలేకపోవడంతో 30% సిలబస్‌ను తొలగించారు. దానికి అనుగుణంగానే ఎంసెట్‌లోనూ 70% సిలబస్ నుండే పరీక్ష నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, ద్వాతీయ సంవత్సరాలకు వందశాతం సిలబస్ అమల్లో ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు.