కంప్యూటర్ కాపురాలు

చేతిలో స్మార్టు ఫోన్, చంకలో ల్యాప్ టాప్

అలవాటు కాదు అడిక్ట్ అయింది కొన్ని జంటలకు

కాఫీ టిఫిన్స్‌తోనూ కంప్యూటర్ల చాటింగ్

చెంతనే ఉన్న ప‌రిక‌రాల‌తో చెడు ఫలితాలు

సమరం సలహాలకో, సంతాన కేంద్రాలకో

పరుగులు తప్పడం లేదు యువ జంటలకు కూడా

పెళ్లాం పక్కలో లేకపోయినా

లాప్‌టాప్ ఉండాలి చేతికి చేరువలో

గూగుల్‌తో దర్శనం దేశదేశాలు

దారితప్పితే అక్కడే నీలి చిత్రాలు

ఉద్యోగులకు తప్పదు ఆధునిక పరికరాలు

ఉద్వేగాలకు పోతేనే దుష్ఫలితాలు

లింక్‌లతో ఏలోకం చుట్టి వస్తారో

చేతికి ఫోన్ ఇస్తేనే దుఖ్ఖం ఆగుతున్న బాల్యం

యువత హస్త ఆభరణం స్మార్టుఫోన్లే

ఉపాధికి ఆధారం కంప్యూటర్లు

పగలు,రాత్రి ఒడిలోనే ల్యాప్ ట్యాప్‌లు

కంప్యూటర్ కాపురాలు, సెల్‌లో చాటింగ్‌లు

మాటల పొదుపు, ఒంటరి జీవితాలు

మితి మీరుతున్నది, మునిగిపోతున్నారు

 

త‌ప్ప‌క చ‌ద‌వండి:   విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌)

 

శాస్త్ర సాంకేతిక మార్పు ఇది

అరచేతిలోకి వచ్చింది విశ్వం

చురకత్తి లాంటిదే ఈ ప్రగతి

కోస్తావో, కోసుకుంటావో ఫలం

మేలు కోసమే సాంకేతికాభివృద్ధి

సాగాలనేదే మనసు ఆరాటం

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు

త‌ప్ప‌క చ‌ద‌వండి:   

అవసరం

మగ సమాజం

అహం అదే ఇగో   
విమాన యానం     
రాజకీయ జలకాలా`టలా`
కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..
కోనేటి రంగయ్య: మనసు ఆరాటం

 

Leave A Reply

Your email address will not be published.