త్వరలో మండ‌పేట‌లో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన..

తోట త్రిమూర్తులు.. పిల్లి సుభాష్ చంద్రబోస్..

మండపేట (CLiC2NEWS): మండపేట ప‌ట్ట‌ణ పరిసర ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరాబోతోందని వంద పడకల ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయ‌నున్న‌ట్లు మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం మండపేటలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. శనివారం మండపేట విచ్చేసిన బోస్ శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులును కలిశారు. ఆయనతో కలిసి రెండో వార్డు పరిథిలో ఉన్న వేర్ హౌస్ గొడౌన్ ఖాళీ ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరువురు కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ ఎం ఐసీ ) శాఖకు చెందిన అధికారులు డిఈ సత్య ప్రకాష్, ఏఈ శేషగిరిరావులు స్ట్రక్చరల్ డిజైన్ ను వారికి చూపించారు. డిజైనింగ్ పేపర్స్ ను పరిశీలించి వారితో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండపేట పరిసర ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరాబోతోందని వంద పడకల ఆసుపత్రికి త్వరలోనే శంఖుస్థాపన కూడా చేస్తామని చెప్పారు. కౌన్సిలర్ లు పోతంశెట్టి ప్రసాద్, చిట్టూరి సతీష్ లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పురాతనమైన సత్తెమ్మ తల్లి దేవాలయం గ్రామ దేవతగా ఉందని ఆ దేవాలయాన్ని తొలగించ వద్దని కోరారు. శాసన మండలి సభ్యులు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ విషయాన్ని ఇంజనీర్లు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం సత్తెమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, వైస్ చైర్మన్ లు వేగుళ్ళ నారాయణరావు, పిల్లి గనేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పార్టీ నాయకులు రెడ్డి రాథాకృష్ణ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, మహిళా నాయకురాలు వైవిఎస్ శ్రీదేవి, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, జిన్నూరి సాయిబాబా, అధికారి శ్రీనివాస్, తాడి రామారావు, సాధనాల శివ భగవాన్, సిరిపురపు శ్రీనివాస్, పుట్టపూడి వీర వెంకట సత్యనారాయణ(అబ్బు), యారమాటి వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.