సెహబాష్ భారతీయుడా..

చంద్రయాన్3 ల్యాండింగ్ శుభాకాంక్షలు ..

సెహబాష్ భారతీయుడా….
అత్భుతం…ఆనందం…యావత్ దేశం ఆబాల గోపాలం.. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలంతా నరాలు తెగే ఉత్కంఠతకు గురయిన క్షణాలు..దక్షిణ ధృవాన్ని ముద్దాడిన విక్రమ్.రెండు సార్లు విఫలమయినా ముచ్చటగా మూడోసారి విజయాన్ని సాధించి యావత్ ప్రపంచ ప్రజలనుంచి మన్ననలు పొందుతున్న ఇస్రో శాస్త్రజ్ఞులకు యావత్ దేశప్రజలు జేజేలు పలుకుతున్నారు.బ్రిక్స్ సమావేశంలో వున్నా తన మనసంతా చంద్రయాన ప్రక్రియపైనే ఉంచి..వర్చువల్ గా చూస్తూ దేశ ఖ్యాతిని పలు దేశాలకు వివరించారు మన ప్రధాని నరేంద్రమోడీ..చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడిన మొదటి దేశంగా భారత్ దేశం చరిత్ర సృష్టించింది. ఇది ఈ శతాబ్దంలో అద్భుత ఘట్టం. ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయం. ఇక మన మామ చంద మామా మనకు మేనమామే.. చంద మామ రావే జాబిల్లి రావే కాదు. అందని చంద మామా మనకు అందినాడు. ఇక మామా ఇంటికి పోయి రెండు రోజులు వుండే రోజులు వచ్చాయి.. చంద్రయాన చరిత్ర తో మన శాస్త్రజ్ఞుల సత్తా ప్రపంచానికి తెలిసింది. మన మేధస్సుకు మరింత పదును పెట్టాల్సిన అవసరం మన యువతరానిది. అనాదిగా మనకు ఉన్న విద్యను మనం పుణికి పుచ్చుకోవాలి..పరిశోధనలు చేయాలి. విజ్ఞాన సుగంధాలను వెదజల్లుతూ జ్ఞానకాంతులు వెదజల్లాలి. భారత దేశ పతాకాన్ని నలుదిశలా ఎగరవేయాలి..
ఈ శుభ సమయాన్ని పంచుకున్న ప్రతీ భారతీయుడికి నా అభినందనలు..
జై భారత్…జైజై భారత్.

-ఎస్. వి.రమణా చారి
జర్నలిస్ట్,హైదరాబాద్
9 8 4 9 8 8 7 0 8 6

Leave A Reply

Your email address will not be published.