కంగ్రాట్స్ వేణు.. ‘బ‌ల‌గం’ టీమ్‌కు ‘చిరు’ ప్ర‌శంస‌!

హైద‌రాబాద్ (CLiC2NEWS): కంగ్రాట్స్ వేణు.. బ‌ల‌గం చిత్రాన్ని రూపొందించి మాకు షాక్ ఇస్తే ఎలా చెప్పు అంటూ.. మెగస్టార్ చిరంజీవి శనివారం చిత్ర టీమ్‌ను అభినందించారు. . భోళా శంక‌ర్ సెట్‌లో బ‌ల‌గం టీమ్‌ను ఆయ‌న స‌న్మానించారు. తెలంగాణ సంస్కృతిని ఈ సినిమాలో 100 శాతం చూపించావ‌న్నారు. గ‌తంలో జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై వేణు చేసిన స్కిట్ చూశాన‌ని.. అపుడే అత‌నిపై గౌర‌వం పెరింగింద‌న్నారు. ఈ సినిమాతో త‌న టాలెంట్‌ని నిరూపించుకున్నాడ‌ని వేణుని ప్ర‌శంసించారు. ఈ సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూస‌ర్ ఉన్నాగానీ.. నువ్వే దీనికి పూర్తి న్యాయం చేశా‌న్నారు. వీటికి సంబంధించిన వీడియో ప్రియ‌ద‌ర్శి, వేణు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

జ‌బ‌ర్ద‌స్త్ వేణు తెర‌కెక్కించిన చిత్రం బ‌ల‌గం ఇటీవ‌ల విడుద‌లై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ సంస్కృతిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఈ చిత్రంలో చూపించారు.

Leave A Reply

Your email address will not be published.