సైనిక బలగాలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు.. ఖర్గే

ఢిల్లీ (CLiC2NEWS): పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ పార్టి మద్దతు తెలిపింది. తమ పార్టి తరపున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైనికులు మంగళవారం రాత్రి పాకిస్థాన్ లో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు.
భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టి వర్కింగ్ కమిటి బుధవారం సమావేశమయ్యింది. పార్టి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కెసి వేణుగోపాల్, సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు. భారత్ సైనికులు చేపట్టిన సాహసోపేత ఆపరేషన్ సిందూర్ చర్య ను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడానికి అన్ని స్థాయిల్లో ఐక్యంగా ఉండాలన్నారు. సాయుధ దళాలకు కాంగ్రెస్ పార్టి తరపున పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించారు.