కాంగ్రెస్ అభ్యర్థులు హైదరాబాద్‌కు..!

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు వారి వారి పార్టీలకే పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కౌంటింగ్‌కు ముందు అభ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు అధిష్టానం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. పార్టీ అభ్యర్థులను హైదరాబాద్ రప్పించాలని, నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణలో వారికి ఎఐసిసి ప్రతినిధులు దిశానిర్దేశం చేయడానికి యోచిస్తున్నట్లు సమాచారం.