హిమాచల్ లో కాంగ్రెస్ ఘన విజయం

సిమ్లా (CLiC2NEWS): హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఇక్కడి మొత్తం 68 స్థానాలు ఉండగా సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం 35 స్థానాలు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనాసాగుతోంది.
కాగా భారతీయ జనతా పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకుంది. ఇతరు మూడు స్థానాల్లో గెలిచారు.