కులాల కన్సాలిడేషన్
గొర్రెలు, బర్రెలు, కొత్త ‘బంధు’త్వాలు
ఎక్కడివాని అక్కడే ఉంచే పథకాలు
చెప్పు చేత్లుల్లో నిలిపే ప్రయత్నాలు
కులాల పేర ఓటర్ల కన్సాలిడేషన్
మొత్తంగా కలిసి వచ్చింది మైనారిటీ
దళితులు దగ్గరైతే ఇక డోకా ఎక్కడుంది
వయోజనుల్లో మూడొంతులు ఒక ముద్దవుతుంటే
బలహీన విపక్షాలతో బయంలేని రాజకీయం
ఏక పార్టీ, ఏక కులం, ఏక కుటుంబం
కూడగట్టుకున్న బడుగులతో
నాటి ఇందిరమ్మ ఓటు బ్యాంకుకు చిల్లు
చెప్పేది అంతా సాచ్యురేషన్ అని
అమలయ్యేది శాంపిల్స్ లాగే
స్థిరమవుతున్న రాజ్యాధికారం
విద్యా,వైద్యం గాలిలో దీపం
అటెకక్కిన కెజి టు పిజి
నిలిచి పోయిన నియామకాలు
నిరంతర వ్యయానికి తిలోధకాలు
తాత్కాలిక తాయిలాలతో ప్రచార ఉదృతి
నిజాలు తెలియని అమాయక జనం
అంతా మనకేనని సంబరపడుతుంటే
కలకాలం ఇక బానిస బతుకులే…
చాటి చెప్పాలనే ఆత్రుతలో
మనసు పడుతుంది అధిక ఆరాటం.
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు