జయహో! భారత పతాకమా

జనగణమన దరహాసమా
ప్రభాత జాగృత మయూఖమా
భావి తరాలకు సందేశమా! । జయ ।

స్వరాజ్య సాధన సమరంలో
ఆత్మ గౌరవపు గర్జనలో
జన భారత శంఖనాదమా
జాతి ముక్తికై ఎత్తిన పిడికిలి
గుండు పేల్చిన గుండె చెదరని
సత్తువ చూపిన సాహసమా । జయ ।

గగన సీమలో సమున్నతంగా
స్వతంత్ర కీర్తికి గణతంత్ర స్ఫూర్తికి
తేజరిల్లు జయకేతనమా
భారతీయతే జాతీయతగా
కులమతాలకు అతీతమై
ఐక్యతకిది సంకేతమా । జయ ।

ప్రజా రక్షణే ధ్యేయంగా
ప్రజా పాలనే లక్ష్యంగా
ప్రగతిని చూపే వికాసానికి
ప్రపంచ శాంతి ప్రబోధానికి
పుటలు విప్పిన రాజ్యంగమా । జయ ।

-శేషం శ్రీనివాసా చార్య
Rtd GHM
ఫోన్: 94406 59257

Leave A Reply

Your email address will not be published.