రూ. 410కోట్ల‌తో మానేరు రివ‌ర్ ఫ్రంట్ నిర్మాణం

క‌రీంన‌గ‌ర్-వ‌రంగ‌ల్ పాత రోడ్డులో తీగ‌ల వంతేన‌ నిర్మాణం

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): క‌రీంన‌గ‌ర్‌ను ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి గంగుల క‌మాలాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం మంత్రి దిగువ మానేరు డ్యాం గేట్ల కిందిభాగంలో మానేరు రివ‌ర్ ఫ్రంట్ నిర్మాణ ప‌నులను ప‌రిశీలించారు. రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్, ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ అధికారులు, టూరిజం అధికారులు, క‌లెక్ట‌ర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదేశాల మేర‌కు క‌రీంన‌గ‌ర్‌ను సుంద‌ర న‌గ‌రంగా తీర్చి దిద్దుతామ‌ని తెలియ‌జేశారు. రూ. 410కోట్ల‌తో మానేరు రివ‌ర్ ఫ్రంట్‌ను మొద‌టిద‌శ 3.75కిజ‌మీ వ‌ర‌కు పూర్తి చేస్తామ‌ని, రెండో ద‌శ‌లో 6.25 కి.మీలు పూర్తి చేస్తామ‌ని వివ‌రించారు. మానేరు రివ‌ర్ ఫ్రంట్‌లో 12 నుండి 13ఫీట్ల లోతు వ‌ర‌కు నీరు నిల్వ ఉంటుంద‌ని, దీనిలో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు ప‌ర్యాట‌కుల‌కు ఆక‌ర్ష‌ణగా నిలుస్తాయిని అన్నారు.

ముందుగా క‌రీంన‌గ‌ర్-వ‌రంగ‌ల్ పాత రోడ్డులో తీగ‌ల వంతేన‌ను నిర్మిస్తామ‌ని, దీనిపై డైనమిక్ లైట్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సంవంత్స‌రం మే నెల‌లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.