సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ లో కన్సల్టెంట్ పోస్టులు

కోల్‌కతాలోని సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు చెందిన సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో 13 కన్సల్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కన్సల్టెంట్ పోస్టులు 8, అకడమిక్ కన్సల్టెంట్ 1, అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్ 1, ఔట్‌రీచ్ ఆఫీసర్ 1, లీగల్ అడ్వైజర్ 1, అకడమిక్ కో అర్డినేటర్ 1 పోస్టులు కలవు. పోస్టును అనుసరించి అభ్యర్థులు డిప్లొమా, డిగ్రీ (బిబిఎ), పిజి (ఎంబిఎ), పిహెచ్‌డితో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 50వేలు నుండి రూ.99వేల వరకు అందుతుంది.
దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీలోపు పంపించాలి. ది డైరెక్టర్, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్, ఇఎం బైపాస్ రోడ్, పంచశయర్, కోల్‌కతా చిరునమాకు పంపించాలి. షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయస్సు అకడమిక్/ అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్ పోస్టుకుల 68 ఏళ్లు.. మిగతా పోస్టులకు 63 ఏళ్లు మించకూడదు.
పూర్తి వివరాలకు https://srfti.ac.in/ వెబ్‌సైట్ చూడగలరు .