జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

హైదరాబాద్ (CLiC2NEWS): ఎగువ ప్రాంతాలలో కురిసి భారీ వర్షాలకు అక్కడ నుంచి వరద ప్రవాహం
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 42,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 29,051 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం వైపు 25,589 నీరు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.749 టీఎంసీలు. జలాశయంలో ఇప్పుడు 6.657 టీఎంసీల నీరు నిల్వ ఉంది.