2008 డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు

హైదరాబాద్ (CLiC2NEWS): 2008 డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త. 2008 డిఎస్సి అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్సిలో అర్హత సాధించి ఉద్యోగం పొందని బిఇడి అభ్యర్థులకే ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. డిఐడి ఉన్న వారికి 30% ఎస్జిటి పోస్టులు కేటాయించగా.. 30% నష్టపోయిన బిఇడి అభ్యర్థలుకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది.