TS: డ్రగ్స్ కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణరాష్ట్రంలో డ్రగ్స్ అనేమాట వినిపించకుండా కఠినంగా వ్యవహరించాలని సిఎం కెసిఆర్ ఆధికారులను ఆదేశించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దోషులు ఎంతవారైనా సరే కఠినంగా శిక్షించాలన్నారు. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్, వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. దీనిలో శుక్రవారం భాగంగా స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని నిర్ణయించారు.