భారత సైనికుల సేవలు వెలకట్టలేనివి.. గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి, ధ్రవపత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారత ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి కారణం సరిహద్దుల్లో ఉన్న మన సైనికులేనని.. వాని సేవలు వెలకట్టలేనివని అన్నారు. చైనా కవ్వింపు చర్యలకు మన సైనికులు వారికి దీటుగా బదులిచ్చారన్నారు. విజ య్ దివస్‌కు ముందు స్నాతకోత్సవం జరగడం ఆనందంగా ఉందని.. నేర్చుకోవడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియని గవర్నర్ అన్నారు.
Rattling fantastic info can be found on web site.