అధిక ఉష్ణోగ్ర‌త‌ల నుండి ఉప‌శ‌మ‌నం పొ్ంద‌డానికి కూల్‌రూఫ్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌స్తుతం ఎండ‌లు విప‌రీతంగా మండిపోతున్నాయి. ఈ ఏడాది ముందుగానే వేస‌వికాలం వ‌చ్చేసింది. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌నుండి కొంత ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి కూల్‌రూఫ్ (చ‌లువ పైక‌ప్పు) ఏర్పాటు చేసుకోవ‌డం ఉత్త‌మం అంటున్నారు. కూల్‌రూఫ్ వ‌లన‌ అధిక ఉష్ణోగ్ర‌త‌ల ప్ర‌భావంను త‌గ్గించుకునేందుకు వీలుంటుంది. దీనివ‌ల్ల సూర్య కిర‌ణాలు తిరిగి వాతావ‌ర‌ణంలోకే ప‌రావ‌ర్త‌నం చెంద‌డం ద్వారా ఇంటిలోప‌ల‌కు వేడి రావ‌డం త‌గ్గుతుంది.

రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023-28 తీసుకొచ్చింది. సోమ‌వారం మంత్రి కెటిఆర్ దీనిని ప్రారంభించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 100 చ‌.కి.మీ మేర‌, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంలో 300 చ.కి.మీ విస్తీర్ణంలో కూల్‌రూఫ్స్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కూల్‌రూఫ్ పాల‌సీ భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మమ‌న్నారు. దీనికి మీట‌ర్‌కు రూ.300 మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంద‌ని.. క‌రెంట్ బిల్లులు త‌గ్గే అవ‌కాశం ఉన్నందున పెట్టిన పెట్టుబ‌డి తిరిగివ‌స్తుంద‌న్నారు. ఈ విధానం అమ‌లు చేసేందుకు వీలుగా ఏజెన్సీల‌తో స‌మ‌న్వ‌యం, దీనికోసం ముందుకొచ్చే వారికి శిక్ష‌ణ ఇస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే నిర్మించిన భ‌వ‌నాలపై కూల్‌రూఫ్ ఏర్పాటుకు ప‌లు ప‌ద్ద‌తులుకూడా ఉన్నాయ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.