Corona: 10 మందికి పైగా న‌క్స‌ల్స్ మృతి!

రాయ్‌పూర్ (CLiC2NEWS): దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రే కాకుండా దంకార‌ణ్యాల‌కూ పాకింది. అడ‌వుల్లో ఉండే మావోయిస్టుల‌ను సైతం క‌రోనా వైర‌స్ వ‌ద‌ల‌డం లేదు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లా ద‌క్ష‌ణి బ‌స్త‌ర్ అడవుల్లో క‌రోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ వెల్ల‌డించారు. మ‌రో 100 మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా సోక‌డం, క‌లుషిత ఆహారం తిన‌డంతో మావోయిస్టులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. కాగా క‌రోనాతో చ‌నిపోయిన వారిలో మావోయిస్టు అగ్ర‌నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.

ఛ‌త్తీస్ గ‌ఢ్ లో గ‌త కొద్ది రోజుల్లో క‌రోనా కేసుల రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 11,867 కొత్త కేసులు వెలుగుచూశాయి. అలాగే 172 మంది క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,25,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

slot resmi

Leave A Reply

Your email address will not be published.