కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందరూ మాస్కు ధరించాలి..
హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకు లు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ కోఠీలోని డిపిహెచ్ కార్యాలయంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు…
“తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 555 కేసులు నమోదయ్యాయి. దాదాపు 56 శాతం పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 36 వేలకు పైనే ఉండగా.. తెలంగాణలో 811 మంది బాధితులు ఉన్నారు. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చి తగ్గుముఖం పట్టి.. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగదలను చూస్తున్నాం. కేసుల సంఖ్య పెరుగున్నా.. ఆస్పత్రిలో చేరికలు.. మరణాలు దాదాపు సున్నాగానే ఉన్నాయి. “ డిహెచ్ వివరించారు.
రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు.