India Corona: మ‌ళ్లీ పెరిగిన కేసులు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 41,195 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు గురువారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది..

  • కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది.
  • కొత్త‌గా 39,069 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,12,60,050 మంది డిశ్చార్జి అయ్యారు.
  • కొత్త‌గా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కొవిడ్ బారినపడి మొత్తం 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడ్డారు.
  • ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • టీకా డ్రైవ్‌లో భాగంగా 52.36 డోసులు పంపిణీ చేశారు.
Leave A Reply

Your email address will not be published.