దేశంలో త‌గ్గిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసుల సంఖ్య కాస్త త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 13,086 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న 16 వ‌లేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. కాగా నిన్న‌టితో పోలిస్తే 18 శాతం త‌క్కువ కేసులు న‌మోద‌య్యాయి.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 24 మంది ప్రాణాలు క‌రోనా బారిన ప‌డి కోల్పోయారు. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.14 ల‌క్ష‌ల మార్కును దాటింది.
తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35, 31,650కి చేరింది. వీటిలో 4,28,91,933 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్ప‌టి వ‌ర‌కు 5.25 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం దేశంలో 1,14,475 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.