కేరళలో కరోనా డేంజర్ బెల్స్..!
న్యూఢిల్లీ (CLiC2NEWS): కేరళ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక్కడ కేసుల సంఖ్య రోజురోజుకి పెరగిపోతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కేరళలో 30 శాతం మేర కేసులు పెరిగాయని వెల్లడించింది. దీంతో కేరళలో నమోదైన కేసులు మూడో వేవ్‌కి వార్నింగ్ బెల్స్ మోగించాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే అక్టోబర్ చివరి నాటికి థర్డ్‌వేవ్ ఉధృతం కావచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ, పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో వీలైనంత ఎక్కువమంది టీకాలు వేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కరోనా నిబంధనలు.. మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిదని.. జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.