విదేశాలనుండి వచ్చిన ఆరుగురుకి కరోనా..
ఒమిక్రాన్ గుర్తించిన దేశాలనుండి వీరు రావడం ఆందోళనల కలిగిస్తోంది?

ముంబయి(CLiC2NEWS): విదేశాలనుండి మాహారాష్ట్రకు చేరుకున్న ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా ఉన్నట్లు నిర్థారణయ్యింది. ఆరుగురు వ్యక్తుల్లో కొంతమందికి లక్షణాలు కనిపించలేదని, మరికొందరికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గుర్తించిన దేశాలనుండి వీరు రావడం ఆందోళనల కలిగిస్తోందని , వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు పేర్కొంది. ఒమిక్రాన్‌పై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో.. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో విదేశాలనుండి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు చేయడంతో పాటు కఠిన క్వారంటైన్ నియమాలు అమలవుతున్నాయి.