India Corona: కరోనా ఉధృతి.. కొత్తగా 47,092 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కొత్త కేసుల నమోదు సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 41వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. తాజాగా 47వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 47,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా తాజాగా 35,181 మంది బాధితులు కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,20,28,825 మంది కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మహమ్మారి బారినపడి 509 మంది మరణించారు.
- ఇప్పటి దేశంలో వైరస్ బారినపడి మొత్తం 4,39,529 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ప్రస్తుతం దేశంలో 3,89,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌లో భాగంగా 66,30,37,334 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
- కొత్త కేసుల్లో 70శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.