వూహాన్‌లో కరోనా కలకలం: మళ్లీ వైరస్ పరీక్షలు

వుహాన్ (CLiC2NEWS): 2019 డిసెంబర్‌లో వూహాన్‌లో ప్రపంచంలోనే కరోనా మొదటి కరోనా కేసు వెలుగుచూసిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ మొదలైన వైరస్ మహ్మమ్మారి ప్రపంచమంతా పాకింది. కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అదుపులోకి తెచ్చింది. ఆ తరువాత ఆ నగరం మెల్లిగా కరోనా నుంచి కోలుకుంది. అయితే, సంవత్సరం తరువాత మళ్లీ వూహన్ కరోనా కేసు నమోదైంది. వుహాన్ నగరంలో సుమారు కోటిన్నర మంది నివాసితులు ఉన్నారు. అయితే వారందరికీ సమగ్ర న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేయనున్నట్లు ఆ నగర అధికారి లీ టావో తెలిపారు.
తాజగా వూహాన్‌లో ఏడు మంది వలస కార్మికులకు వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు. ఇటీవల మళ్లీ వైరస్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చైనాలోని అన్ని నగరాల్లోనూ ఆంక్షలను మళ్లీ కఠినతరం చేశారు. మంగళవారం కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. చైనాలో అన్ని నగరాల్లో వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచారు