Corona India: కొత్తగా 2,11,298 కేసులు.. 3,847 మరణాలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 పెరిగాయి.
కొత్తగా 2,83,135 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 2,46,33,951 మంది కోలుకున్నారు. దేశంలో కొత్తగా వైరస్ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు వదిలారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 3,15,235 మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 24,19,907 యాక్టివ్ కేసులున్నాయి.