కరోనా ఇంకా పోలేదు.. చిన్నారులకు వ్యాక్సినేషన్ పెంచండి

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ ప్రధాన నగరాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సమయంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం ప్రభుత్వం కరోనా కట్టడి చేయడానికి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ పెంచాలని సూచించారు. అదేవిధంగా వృద్ధులకు ప్రికాషన్ డోసులను ఇవ్వాలని ఆదేశించారు.