కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌రోనా కేసులు దేశంలో తీవ్ర‌మ‌వుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మ‌రోవైపు సామాన్యుల మొద‌లు ప్ర‌ముఖులు, సెల్ర‌బిటీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.

తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి క‌రోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు కొవిడ్ స్వ‌ల్ప ల‌క్షణాలు ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్న‌ట్లు కిష‌న్‌రెడ్డి ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Leave A Reply

Your email address will not be published.