మహేశ్‌బాబుకు కరోనా పాజిటివ్..
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ నటుడు మహేశ్‌బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విటర్ వేదికగా తెలియజేశారు. వైద్యుల సలహామేరకు హోంఐసోలేషన్లో ఉన్నానని తెలిపారు. ఇటివల తనని కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ టీకా తీసుకొండి, టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయని మహేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు.