గాయని లతా మంగేష్కర్‌కు కరోనా..
ముంబయి (CLiC2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వైద్యులు, పోలీసులు, మంత్రులు అందరికీ ఈ వైరస్ వ్యాపిస్తోంది. తాజాగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆమె సమీప బంధువు మీడియాకు వెల్లడించారు. ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఐసియూలో ఉంచి చికిత్స నందిస్తున్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం బాగానే ఉన్నా.. ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఐసీయూలో చికిత్సనందిస్తున్నారని సమాచారం.