దేశంలో క‌రోనా ఉద్ధృతి.. 20 ల‌క్ష‌లు దాటిన యాక్టివ్ క‌రోనా

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.  కొత్త‌గా 3 ల‌క్ష‌ల 50వేల‌కు చేరువ‌లో క‌రోనా క‌రోనా న‌మోద‌య్యాయి. అటు ఈవైర‌స్‌తో మ‌ర‌ణించేవారి సంఖ్య‌కూడా పెరిగింది. గ‌డిచిన‌ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 19 ల‌క్ష‌ల మందికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా.. 3,45,254 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. ఒక రోజులో వ్య‌వ‌ధిలో దేశంలో 703 మంది మ‌ర‌ణించారు.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 2,51,777మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 20,18,825 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశంలో కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల‌లో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈమూడు రాష్ట్రాలో 1.40 లక్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి, దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా పెరుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఒమిక్రాన్ బారిన ప‌డిన వారి సంఖ్య 9,692 కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.