మహారాష్ట్రలో 499 మంది పోలీసులకు కరోనా..

ముంబయి (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. పలువురు వైద్యులు, పోలీసులు, ప్రముఖులు సైతం కరోనా భారిన పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఒక్కరోజులో 499 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 95 మంది పోలీసు అధికారులున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4090 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఒక్క ముంబయి నగరంలోనే ప్రస్తుతం 1273 మంది పోలీసులు కరోనా చికిత్స తీసుకుంటున్నారు.