బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు కరోనా

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త కరోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న‌కు వైర‌స్ సోక‌డంతో హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు.వైరస్​ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున.. తీసుకోవాల్సిన మందులు, ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఆయనకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ చేశారు. ​ప్రస్తుతం ప్రవీణ్​కుమార్​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈనెల 8న న‌ల్ల‌గొండ‌లో నిర్వ‌హించిన రాజ్యాధికార సంకల్ప స‌భ‌లో పాల్గొన్న ప్ర‌వీణ్‌కుమార్ బిఎస్పీలో చేరిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.