TS: ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు కారోనా..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసినదే. ఆనేకమంది వైద్యలు, పోలీసులు, రాజకీయ నాయకులు ఈ మహామ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ డిహెచ్ శ్రీనివాసరావు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరుతున్నానన్నారు. ఏవిధమైన అపోహలు, ఆంధోళనలు వద్దని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాఅని తెలిపారు.