CoronaVaccine: 45 ఏళ్లు దాటిన వారికే టీకా..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో 45 ఏళ్లు దాటి వారికే కరోనా టీకాలు వేస్తామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి టీకాలు వేయటం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీలోని ఒకో కేంద్రంలో రోజుకు 200 మందికి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. మిగతా చోట్ల ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు వేయనున్నట్లు శ్రీనివాస రావు తెలిపారు. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు.