మ‌హారాష్ట్ర‌లో ఎదురు కాల్పులు: 26 మంది మావోయిస్టులు మృతి!

గ‌డ్చిరోలి (CLiC2NEWS): మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలిలోలి అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు.. జావాన్ల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లింది. ఇక్క‌డ జరిగిన ఎదురు కాల్పుల్లో భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం ఉద‌యం నుంచి జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 26 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం.

ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన విష‌యాన్ని గ‌డ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయ‌ల్ ధ్రువీక‌రించారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో న‌లుగురు జ‌వాన్లు గాయ‌ప‌డిన‌ట్లు ఎస్పీ తెలిపారు. గాయ‌ప‌డిన జ‌వాన్లు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని పేర్కొన్నారు.

శ‌నివారం ఉద‌యం గ్యార‌ప‌ట్టి అట‌వీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో మావోయిస్టులు, జ‌వాన్ల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఉద‌యం నుంచి ఈ కాల్పులు జ‌రిగాయి. కాల్పుల అనంత‌రం 26 మంది మావోయిస్టుల మృత‌దేహాల‌ను గుర్తించార‌ని స‌మాచారం . ఈ ఎదురుకాల్పుల ఘ‌ట‌న‌తో స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.