ఒక్కరోజులో కొవిడ్ కేసులు 90 శాతం పెరుగుదల..
ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు వెయ్యికి దగ్గర్లో నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం ఒక్కరోజులో రెండువేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మరణాలు కూడా 200కుపైగా నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో 15 రోజుల్లో కరోనా వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ఆధారంగా.. గడిచిన 24 గంటల్లో 2.6 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2.183 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజులో 214 మంది మహమ్మారికి బలైనారు. దీనిలో ఒక కేరళ నుండి 213 ఉండటం గమనార్హం. ఇక నిన్న ఒక్క రోజులో 1,985 మంది కరోనా నుండి కోలుకున్నారు.