మార్చి 31 నుండి కొవిడ్ నిబంధనల ఎత్తివేత.. !
![](https://clic2news.com/wp-content/uploads/2022/01/covid-remedies.jpg)
ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రెండు సంవత్సరాలుగా అమలులో ఉన్న కొవిడ్ నిబంధనలను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 31వ తేది నుండి కరోనా నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ
నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. అయతే మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను మాత్రం యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద కేంద్రం పలు నిబందనలను అమల్లోకి తెచ్చింది.